విజయవాడలో రోడ్డు నిర్మాణానికి రూ.7లక్షలు
ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుండి టెలిఫోన్ కాలనీలో లోతట్టు ప్రాంత కల్వర్టు నిర్మాణానికి సుమారు 7 లక్షల రూపాయలతో నిర్మాణానికి బుధవారం మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల వలన దెబ్బతిన్న కల్వర్టును త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పాడైనా రోడ్ల నిర్మాణం కుడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.