విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా సికింద్రాబాద్ - లక్నో మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఈ రైళ్లు నవంబరు 15, 22 తేదిల్లో సికింద్రాబాద్ నుంచి ( ట్రైన్ నెం.0.07084), నవంబర్ 18, 25 తేదీలలో లక్నో నుంచి (నం.07083) నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.