ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువుతీరి ఉన్న అమ్మవారిని మంగళవారం సినీ హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అభిమానులు వరుణ్ తేజ్ ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో వరుణ్ తేజ్ వెళ్లే వరకు దేవాలయం వద్ద గందరగోళం నెలకొంది.