దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సోమవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆ మహనీయుడు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.