ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రాష్ట్ర బడ్జెట్ లో కాపు సామాజిక వర్గ అభివృద్ధికి తగిన విధంగా నిధులు కేటాయించాలని, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రముఖ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్ కోరారు. సోమవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ లో కాపుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించకపోవడంతో పాటు కాపు యువత విదేశీ విద్య దీవెన వంటి పథకాలను గురించి ప్రస్తావించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.