ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం 2 పథకంలో భాగంగా దీపావళి కానుకగా శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను
ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ లు అందజేశారు. దీపం-2 పథకంగా వ్యవహరిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి తొలివిడతగా జగ్గయ్యపేట పట్టణం చిల్లకల్లు రోడ్డులోని హెచ్ పి గ్యాస్ కంపెనీ వద్ద ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది.