గుడివాడ: రక్షణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
మందు గుండ్ల అమ్మే ప్రదేశంలో రక్షణ చర్యలపై కృష్ణాజిల్లా కలెక్టర్ డి కే బాలాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలోని దీపావళి మందు గుండు సామాగ్రి అమ్మే ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ, జిల్లా ఎస్పీ పి గంగాధరరావులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన పోర్టబుల్ మోటర్ సకాలంలో పని చేయకపోవడంతో అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.