తన క్యాంప్ కార్యాలయ సిబ్బంది, మండెపల్లిలోని వృద్ధాశ్రమంలో గురువారం దీపావళి వేడుకల్లో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన క్యాంప్ కార్యాలయ సిబ్బందితో టపాకాయలు కాల్చి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టర్ తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వృద్ధులతో దీపావళి వేడుకలు చేసుకున్నారు. వారికి స్వీట్లు పంచి పెట్టారు.