కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని టామరిండ్ రెస్టారెంట్లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. నాణ్యత పరిమాణాలు అధ్వానంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానిత కల్తీ ఆహార పదార్థాల శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. టామరిండ్ రెస్టారెంట్ నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు.