కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలనీ ఏపీ రైతుసంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం ఘంటసాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. విజయ ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సురేంద్రనాధ్ బెనర్జీ మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నారు.