చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురు నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. మంగళవారం అర్ధరాత్రి భారీగా ట్రాక్టర్ల రేవు నుంచి ఇసుకను తరలిస్తున్న రెవిన్యూ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో భారీగా ఇసుక అక్రమ రవాణా సాగుతుందని కొంతమందికి సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.