పెద్దాపురం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ చంటి పిల్లల వైద్యుడు డాక్టర్ ఇందన జయకృష్ణ బుధవారం తెల్లవారుజామున ఆయన స్వగృహంలో మృతి చెందారు. వైద్య వృత్తిలో విశేష ప్రావీణ్యం కలిగిన డాక్టర్ జయకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీతో చేరి, టీడీపీ తరపున ఎం.పి.పి గా గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ నాయకులు, వైద్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.