నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ తన సొంత కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు నియోజకవర్గ కేంద్రంలో సొంత కార్యాలయం ఏర్పాటు ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం మరిన్ని సేవలు విస్తృతంగా అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పలువురు ఆయనను అభినందించారు.