డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల వంతెనకు ఇరువైపులా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలను మంగళవారం తొలగించి శుభ్రపరిచారు. వంతెనకు అటు ఇటు పెద్ద ఎత్తున తుప్పలు పెరిగిపోవడంతో అమలాపురం నుంచి రావులపాలెం వైపు వెళ్ళు, వచ్చు వాహనాలకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బంది పడేవారు. ప్రస్తుత డొంకలను తొలగించడంతో సమస్య పరిష్కారం అయింది. దీంతో సంబంధిత అధికారులను ప్రయాణికులు అభినందిస్తున్నారు.