బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ఈనెల 27న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో సోమవారం కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ తదితర అధికారులతో కలిసి జిల్లా అధికారులందరిచే ప్రతిజ్ఞ చేయించారు.