బాణా సంచా దుకాణాల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశం నేతలు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ అధికారులు ద్వారంపూడి మాటే వింటున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు వీరు విమర్శించడం సరికాదన్నారు.