కాకినాడ: తొలి కార్తికసోమవారం శివాలయాలు కిటకిట
కాకినాడలో తొలి కార్తీక సోమవారం కావడంతో పలు శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.