తాడిపత్రి పట్టణంలో స్థానిక నెహ్రూ పార్కు వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందన్నారు