ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్టోబర్ 31వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తుమ్మల రాధాకృష్ణ కోరారు. మంగళవారం రైల్వే కోడూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కొరకు, జీవన ప్రమాణాలు మెరుగుదల కొరకు ఏఐటియుసి అలుపెరుగని పోరాటాలు చేసిందన్నారు. కార్యక్రమంలో గంగాధర్, మురళి, సరోజనమ్మ, కృష్ణ చైతన్య పాల్గొన్నారు.