గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పెనగలూరు మండలం అనంతం పల్లి గ్రామ సచివాలయ పరిధిలో పాత పల్లి, అరుంధతి వాడ గ్రామాలలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చిస్తున్న ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు , ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి . ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, తాసిల్దార్ శ్రీధర్ రావు, ఎంపీడీవో వరప్రసాద్, ఎస్సై చెన్నకేశవ, కృష్ణయ్య, శ్రీనివాసులు రెడ్డి , సానా రెడ్డి, రెడ్డయ్య నాయుడు, హరీష్ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, సర్పంచులు, ఎంపి టిసిలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.