గుర్రంకొండ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. ఆలయ పూజారి మహేష్ స్వామి చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రంకొండ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మధు రామచంద్రుడు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.