ముద్దనూరు మండల రైతులకు శనివారం మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి పలు సూచనలు ఇచ్చారు. ముద్దనూరు వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్లో మినుము, శనగ పంటలు సాగు చేసే రైతులు ఆయా పంటల్లో రకాల ఎంపిక, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, కలుపు నివారణ, చీడ పీడల యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్య రక్షణ చర్యలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలిపారు.