ప్రజా సంక్షేమానికి, పేదల అభివృద్ధికి పాటు పడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం సరైన విధానం కాదని కలసపాడు మండల సీపీఐ కార్యదర్శి సునీల్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలసపాడులో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇసుకపై అన్ని రకాల పనులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీరయ్య, కాశన్న, రమణారెడ్డి పాల్గొన్నారు.