ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడారు. మరో సారి జగన్‌లాంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తే విశాఖతోపాటు సముద్రమూ మిగలదని అన్నారు. ఈ భవనాలను దేనికి వాడుకోవాలో అర్ధం కావట్లేనదని చెప్పుకొచ్చారు. రుషికొండను టచ్ చేసే ధైర్యం మామూలు వ్యక్తులకు ఉండదని ఎద్దేవా చేశారు.