గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం
పెదకాకాని మండలవెంకటకృష్ణాపురం గ్రామంలో ఆదివారం అగ్ని ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలి అమ్మిశెట్టి తులసి నాథ్ ( 37) మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదకాకాని సిఐ నారాయణస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూరింట్లో దీపారాధన చేస్తుండగా ప్రమాదవశాత్తు దీపం తాటాకులకు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సీఐ తెలిపారు.