పొన్నూరులో శనివారం గుంటూరు జిల్లా ఎస్ఈ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ ఓబులు పర్యటించారు. పట్టణంలోని కంపోస్ట్ యార్డ్ ను తనిఖీ చేశారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసే కేంద్రం పిగ్ షెల్టర్లను, కంపోస్ట్ ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం నిడుబ్రోలు రక్షిత మంచినీటి కేంద్రాన్ని పరిశీలించి పట్టణ ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు.