క్రోసూరు మండలం దొడ్లేరులో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి 285 మంది శిబిరానికి హాజరయ్యారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందే విధానం గురించి వివరించారు. ఎముకలు, కీళ్ల నొప్పులకు సంబంధించి ఉచితంగా సాంద్రత పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ చెన్నారెడ్డి, డాక్టర్ వసంతరాయ వైద్య సేవలు అందజేశారు.