పెదకూరపాడు లోని ఎన్టీఆర్ శుద్ధజల కేంద్రాన్ని టిడిపి నేతలు గురువారం ప్రారంభించారు. పెదకూరపాడు తాగునీటి చెరువు ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్కీం మూత పట్టడంతో మళ్లీ ప్రారంభించారు. పెదకూరపాడు సర్పంచ్ గుడిపూడి రాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్తిమల్ల రమేష్, గోపాలరావు, బాబు, ఆంజనేయులు, అప్పారావు, కాల్వ అప్పారావు పాల్గొన్నారు.