సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మాచర్ల రూరల్ సీఐ కార్యాలయంలో గురువారం టీడీపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివారెడ్డి ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి. ఆర్ నాయుడుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. తక్షణమే పోలీసులు పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.