అద్దంకి మండలంలోని శంకవరప్పాడు గ్రామానికి చెందిన లకేష్ (16) ఒంగోలు సమీపంలోని పెళ్ళూరులో హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్నాడు. 5 రోజుల క్రితం కండ్లకలకతో ఇంటికి వచ్చిన లకేష్ తిరిగి శుక్రవారం ఒంగోలుకు బయలుదేరి వెళ్లాడు. అయితే 2 రోజుల నుంచి లకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పాటు అతని ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి లాజర్ శనివారం అద్దంకి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.