పొన్నూరు: ధూళిపాళ్లకు న్యాయం చేయాలని తెలుగు మహిళ పాదయాత్ర
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ తెలుగు మహిళా ఆధ్వర్యంలో మహిళా నాయకులు, ఆదివారం పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బాపట్ల జిల్లా చందోలు గ్రామం బండ్లమ్మ తల్లి గుడి వరకు పాదయాత్ర చేశారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని వారు పాదయాత్ర చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ధూళిపాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు.