దళితుడి హత్య కేసును ఛేదించిన పొన్నూరు పోలీసులు
పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో ఈ నెల 9వ తేదీన మాచవరం గ్రామం ఎస్సీ కులానికి చెందిన నక్కల దేవరాజును ములుకుదురు గౌడ కులానికి చెందిన మాధవ్, మణికంఠ మరో ముగ్గురు సాయి, జోసెఫ్, రాజు ఇనుప రాడ్లతో తలపై కొట్టి హత్య చేశారని తెనాలి డిఎస్పి జనార్దన్ రావు గురువారం రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియాకు తెలిపారు. ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని వీరిని త్వరలో కోర్టుకు హాజరు పరుస్తామన్నారు.