ఇరగవరం: ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి
సిపిఎం ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండల తహసిల్దారు కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎం శ్రేణులు మాట్లాడుతూ. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని, ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ₹. 25వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడాన్ని రద్దు చేయాలని, ట్రూ అప్ చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు.