తణుకు: ఈ నెల 24 న 'ప్రజా దర్భార్' కార్యక్రమం
తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఈనెల 24వ తేదీన తణుకు పట్టణ ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'ప్రజా దర్భార్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని అన్నారు. కావున పట్టణ ప్రజలు ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.