పోలవరం: గిరిజనుల మధ్య భూతగాదా
పోలవరం మండలం వింజరం పంచాయతీ తానాలకుంట గ్రామంలో బుధవారం గిరిజనుల మధ్య భూతగాదా జరిగింది. తానాలకుంట గ్రామానికి చెందిన కెచ్చెల భీమారెడ్డి, కెచ్చెల ముక్కారెడ్డి అనే వ్యక్తులు తాము పొలంలో పని చేస్తుండగా పోతింటి వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి, జోగిరెడ్డి, పెంటారెడ్డి అనే వ్యక్తులు ఆ పొలం తమదని దౌర్జన్యానికి పాల్పడి గాయపరిచినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పవన్‌కుమార్ తెలిపారు.