పోలవరం: గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం’
గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి మెరుగైన ధర కల్పిస్తామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఎ పీవో ధాత్రిరెడ్డి తెలిపారు. గురువారం ఐటీడీఏ, కొయ్యలగూడెం కె. ఆర్. పురం ఆధ్వర్యంలో కన్నాపురం నందు గెడ్డపల్లి గ్రామా గిరిజనులచే ఏర్పాటు చేసిన, ప్రకృతి వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సందర్శించారు. అనంతరం ఉత్పత్తుల పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.