చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఏలూరు ప్రాజెక్టు సిడిపిఓ పద్మావతి అన్నారు. ఏలూరు ఫస్ట్ సెక్టార్ పరిధి లోని తంగెళ్ళముడిత్రి అంగన్వాడీ కేంద్రం నందు మంగళవారం మిషన్ శక్తి పథకంలో భాగంగా వంద రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళల చట్టాల గురించి, వన్ స్టాప్ నందు ఆడవాళ్ళ కోసం అందించే సేవల కోసం , ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 గురించి , భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించారు.