చింతలపూడి: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను చేరువ చేసేందుకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న పార్టీ టీడీపి పార్టీ అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేవలం రూ. 100తో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ బీమా రూ. 5 లక్షలు అమలు చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.