జాతీయ రహదారిపై ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల నిరసన
జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద శుక్రవారం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇసుకను రవాణా చేస్తుంటే రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దీని కారణంగా బైపాస్ రహదారిపై కూర్చొని రాస్తారోకో చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్లను సముదాయించారు. టీడీపీ నాయకుడు కొండ్రెడ్డి కిషోర్ వారితో మాట్లాడి నిరసనను విరమింప చేశారు.