చింతలపూడిలో రూ. 4 లక్షలు కాజేసిన దుండగులు
చింతలపూడిలో గుర్తుతెలియని వ్యక్తులు ఒకరి వద్ద నుండి రూ. 4 లక్షలు కాజేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రేచర్ల గ్రామానికి చెందిన చిరు వ్యాపారి చెక్కా శ్రీనివాసరావు యూనియన్ బ్యాంకులో రూ. 4 లక్షలు డ్రా చేసి బయటకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు చాకచక్యంగా నగదును దొంగలించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.