ఆచంట మండలం పెనుమంచిలిలో మంగళవారం పాలకొల్లు ఏఎస్పీ నరసింహరావు ఆదేశాలు మేరకు పోస్టల్ ఉద్యోగులు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు సంబందించి ఎన్పీ సీఐ అనుసంధానంతో కూడిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఖాతా లేనివారికి ఖాతాలు తెరిచే భాద్యత తపాలా శాఖకు అప్పగించింది. కేవలం ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్తే ఖాతా తెరుస్తారని అన్నారు.