పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.