అమలాపురం: విధేయుడిగా ఉంటా: మంత్రి సుభాష్
సత్తమ్మ తల్లి సాక్షిగా చెబుతున్న శెట్టిబలిజ సామాజిక వర్గీయులు పట్ల ఎప్పుడూ విధేయుడిగా ఉంటాను అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం అమలాపురంలోని కొంకాపల్లి సత్తమ్మ తల్లి ఆలయ వద్ద శెట్టిబలిజ సామాజిక వర్గీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 24న జరిగే శెట్టిబలిజ సామాజిక వర్గీయులు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అయ్యే ఖర్చు తన తండ్రి వాసంశెట్టి సత్యం భరిస్తారని తెలిపారు.