కె. గంగవరం: 'పంటు రాకపోకలను పునరుద్ధరించాలి'
కె. గంగవరం మండలం కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేసి మూడు నెలలైంది. గోదావరి వరదలు తగ్గి నెల కావస్తున్న రేవులో నిలిపివేసిన పంటు రాకపోకలను పునరుద్ధరించలేదు. త్వరలో కార్తీక మాసం ప్రారంభం కానుంది. కోనసీమలోని అమలాపురం, ముక్తేశ్వరం, అయినవిల్లి, అంతర్వేది, వెళ్లే భక్తులు ఈ రేవు దాటి వెళితే సుమారు 50 కిలో మీటర్లు తగ్గుతుంది. దీంతో పంటును పునరుద్ధరించాలని ప్రజలు గురువారం కోరారు.