కె. గంగవరం మండలం కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేసి మూడు నెలలైంది. గోదావరి వరదలు తగ్గి నెల కావస్తున్న రేవులో నిలిపివేసిన పంటు రాకపోకలను పునరుద్ధరించలేదు. త్వరలో కార్తీక మాసం ప్రారంభం కానుంది. కోనసీమలోని అమలాపురం, ముక్తేశ్వరం, అయినవిల్లి, అంతర్వేది, వెళ్లే భక్తులు ఈ రేవు దాటి వెళితే సుమారు 50 కిలో మీటర్లు తగ్గుతుంది. దీంతో పంటును పునరుద్ధరించాలని ప్రజలు గురువారం కోరారు.