రాజమండ్రి: ఆపదలో ఉన్న వారికి అండగా భవాని చారిటబుల్ ట్రస్ట్
భవాని చారిటబుల్ ట్రస్ట్ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో భవాని చారిటబుల్ ట్రస్ట్ తరఫున పలువురికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతో మంది పేదలకు, విద్యార్థులకు సహాయం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.