AP: భారత రాజ్యాంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగం లక్ష్యం. భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను ఊహించి దీన్ని రచించారు. రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్ల పాత్ర కీలకం. కొందరు రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కులను కాలరాశారు.’ అని వ్యాఖ్యానించారు.