రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 129 అర్జీలు వచ్చాయని జిల్లా రెవెన్యూ అధికారి సీతారామ్మూర్తి తెలిపారు. తూ. గో జిల్లా అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వాటి పరిష్కారం పై సంబంధిత అధికారులకు డిఆర్ఓ సూచనలు చేశారు.