పవర : రహదారులకు కూటమి ప్రభుత్వం హయాంలో మోక్షం
గత అయిదేళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గ్రామీణ రహదారులకు కూటమి ప్రభుత్వం హయాంలో మోక్షం లభించిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం సామర్లకోట మండలం పవర లో రూ. 65 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు లు, నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చినరాజప్ప ఎంపీ తంగేలా ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు.