మండపేట: పోస్టల్ క్యాంపులు పరిశీలించిన సూపరింటెండెంట్ శేషారావు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పొందే సంక్షేమ పథకాల నగదును పోస్టల్ ఖాతా ద్వారా పొందవచ్చునని రాజమహేంద్రవరం తపాలా పర్యవేక్షణ అధికారి కె. శేషారావు అన్నారు. మండపేటలో సీతారామ కళ్యాణ మండపం వద్ద సోమవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్పీసీఐ ప్రత్యేక క్యాంపుని ఆయన సందర్శించి మాట్లాడారు. సంక్షేమ పథకాల నగదును పోస్ట్ ఆఫీస్ లో కేవలం 200 రూపాయలతో ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ పొందవచ్చని ఆయన అన్నారు.